![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1072 లో....ఇన్ని రోజులు మను మనకు హెల్ప్ చేస్తున్నాడని అనుకున్నాం.. నాకు ముందు నుండి అతనిపై డౌట్ ఉంది కానీ మీరే నమ్మలేదని మహేంద్రతో వసుధార అంటుంది. ఏంటి అమ్మ మనం నమ్మిన వాళ్ళందరూ మనల్ని మోసం చేస్తున్నారని శైలేంద్రని చూపిస్తూ మహేంద్ర అంటుంటే.. నన్ను చూపిస్తూ అలా అంటున్నావేంటి బాబాయ్ అని శైలేంద్ర అంటాడు.. నిన్ను కాదు మనుని అంటున్నానని మహేంద్ర అంటాడు. ఆ మను సంగతి చెప్తాను వెంటనే నోటీస్ వెనక్కి తీసుకోమని చెప్తానని వసుధార అంటుంది. నేను వస్తానని మహేంద్ర, శైలేంద్ర అంటుంటే వాళ్ళని వద్దని చెప్పి వసుధార ఒక్కతే వెళ్తుంది.
శైలేంద్ర మన బుట్టలో పట్టాడని వసుధారకి మహేంద్ర మెసేజ్ చేస్తాడు. ఏదో మెసేజ్ సౌండ్ వస్తుంది బాబాయ్ ఏంటని శైలేంద్ర అడుగుతాడు. లోన్ కావాలా అని అడుగుతున్నారు. యాభై కోట్లు కావాలని మెసెజ్ పెట్టానని మహేంద్ర అంటాడు. ఆ తర్వాత వసుధార స్టేషన్ కి వెళ్లి మనుని కలుస్తుంది. వాళ్ళు మాట్లాడుకుంటుంటే కానిస్టేబుల్ శైలేంద్రకి ఫోన్ చేసి వాళ్ళ మాటలు వినిపిస్తాడు. కానిస్టేబుల్ శైలేంద్ర కి ఫోన్ చేశాడని వసుధార, మనులకి తెలుసు.. దాంతో వాళ్ళు కావాలనే మాట్లాడుకుంటారు. ఏంటి మను గారు నోటిస్ ఎందుకు పంపంచారని వసుధార అడుగుతుంది. నా డబ్బులు నాకు ఇవ్వమని అడుగుతున్నా అంతే కదా లేదంటే కాలేజీని నాకు ఇవ్వండని మను అంటాడు. ఆ తర్వాత కానిస్టేబుల్ పక్కకి వెళ్లి శైలేంద్రతో మాట్లాడతాడు. సర్ మీరు మనుని ఎవరైనా కలిస్తే చెప్పామన్నారు కదా చెప్పడం ఎందుకు వినిపిస్తే బెటర్ అని వినిపించానని అనగానే.. సరే థాంక్స్ అని శైలేంద్ర అంటాడు. సర్ డబ్బులు ఇస్తాను అన్నారని కానిస్టేబుల్ అనాగనే.. పంపిస్తానని శైలేంద్ర చెప్తాడు. ఆ వసుధార మనుని గట్టిగానే అడుగుతుందని శైలేంద్ర అనుకుంటాడు. ఆ తర్వాత కానిస్టేబుల్ లోపలికి వెళ్తాడు. శైలేంద్రకి మొత్తం వినిపించారా అని వసుధార అడుగుతుంది. అవును మేడమ్.. మీరు మాకు చాలా హెల్ప్ చేశారు.. మా బాబు ఇప్పుడు మీ వల్లే సెటిల్ అయ్యాడని వసుధారతో కానిస్టేబుల్ అంటాడు.
ఆ తర్వాత శైలేంద్ర, ఫణీంద్ర వాళ్ళు భోజనం చేస్తుంటారు. శైలేంద్ర ఆలోచిస్తూ ప్లేట్ లో కాకుండా టేబుల్ పై కలుపుకొని తింటుంటాడు. ధరణి చెప్పింది నిజమే అనిపిస్తుంది.. ఎవరో అమ్మాయితో మాట్లాడుతూ ఇలా చేస్తున్నావా అని ఫణీంద్ర అనగానే.. అదేం లేదని శైలేంద్ర అంటాడు. ఆ తర్వాత వసుధార, మహేంద్ర లు వాళ్ళింటికి వెళ్తారు.. రండి కూర్చొని భోజనం చేస్తూ మాట్లాడుకుందామని మహేంద్రతో ఫణీంద్ర అంటాడు. ఆ మను యాభై కోట్లు కట్టకుంటే కాలేజీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు అంటా అని ఫణీంద్ర వాళ్లకు మహేంద్ర చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |